ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు జనసేన కార్యకర్తలు,ఆయన అభిమానులు.. నిన్న ఆదివారం రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యక్రమం సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలను సభకు పోనీవ్వకుండా చేయడం తప్పు. అక్కడకేళ్ళి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వారే ఇలా రోడ్లపై తిరగడం ఏమి బాగోలేదని విమర్శల వర్శం కురిపిస్తున్నాడు.
ఈ సమయంలో పవన్ అభిమానులు,జనసేన కార్యకర్తలు పవన్ స్పీచ్ కు అడ్డు పడుతూ జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. సభలో ఏకంగా వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత జగన్నే వాళ్ళు మాట్లాడనివ్వడంలేదు..వీళ్ళు సభకెళ్ళి ఏమి చేయాలంటూ నిలదీసినట్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
దీంతో పవన్ అయిన కానీ వాళ్ళు సభకు వెళ్ళాల్సింది అని అంటుండుగా ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ పవన్ స్పీచ్ కు అడ్డుపడ్డారు.దీంతో చేసేది ఏం లేక పవన్ చంద్రబాబుపై విమర్శల పర్వం కురిపించారు.ఈ సంఘటన ద్వారా పవన్ అభిమానులకు,జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ అంటే అభిమానమే కానీ రాజకీయంగా జగన్ అంటేనే ఇష్టమని చెప్పకనే చెప్పారు అని ఆర్ధమవుతుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నారు..