నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విసిరిన చాలెంజ్‌ను డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ స్వీకరించారు. అంతేకాకుండా తగు రీతిలో తన చర్యతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ హరితాహారం ఇంచార్జ్ ప్రియాంక వర్గీస్ చాలెంజ్ ను స్వీకరించిన ఎంపి కవిత శనివారం హైదరాబాద్ లోని తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటి, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి పేర్లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
ఎంపీ కవిత విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఉపముఖ్యమంత్రి సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో ని తన నివాసం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఇవాళ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తన కుమారుడు మహమ్మద్ అజం అలీ, మనుమడు ఫుర్కాన్ అహ్మద్ ల పేర్లను నామినేట్ చేస్తూ గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఛాలెంజ్‌ను స్వీకరించిన అజం అలీ ఇవాళ సాయంత్రం మూడు మొక్కలు నాటి తన రెండవ కుమారుడు ఫర్హాన్ అహ్మద్, టీఆర్ఎస్ మలక్‌పేట్ నాయకురాలు సీహెచ్ రాధ, రెహాన్ ల పేర్లను నామినేట్ చేశారు. వారు ముగ్గురూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేస్తారు.
ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు గ్రీన్ చాలెంజ్ ను వినూత్నంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హరితహారం కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.