Home / ANDHRAPRADESH / కర్నూల్ జిల్లాలో ఒకేసారి 200 కుటుంబాలు వైసీపీలో చేరిక..!

కర్నూల్ జిల్లాలో ఒకేసారి 200 కుటుంబాలు వైసీపీలో చేరిక..!

దళితుల అభ్యున్నతికి కృషి చేసింది దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆదివారం హొళగుంద ఎస్సీ కాలనీలో వైసీపీ కన్వీనర్‌ షఫివుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన మృత్యుంజయ, లక్ష్మీనారాయణ. వెంకటేష్, కొమ్ము సాయిబేష్‌తో పాటు 200 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ కి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో టీడీపీ నాయకుల్లో గుబులు పుడుతోందన్నారు. దళితుల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్‌ నిత్యం పాటు పడేవారని అవే లక్షణాలు వైఎస్‌ జగన్‌లో ఉన్నాయని చెప్పారు.

MLA  Gummanur Jayaram Comments On YS Rajasekhar Reddy Kurnool - Sakshi

టీడీపీ పాలనలో వారి పార్టీ కార్యకర్తలకే పథకాలు వర్తింపజేసుకున్నారని అర్హులకు దక్కలేదని విమర్శించారు. వైఎస్సార్‌ పాలన వైఎస్‌ జగన్‌ తోనే సాధ్యమన్నారు. అనంతరం దళిత నాయకుడు తెలంగాణ ఐజీ ప్రవీణ్‌కుమార్‌ జన్మదినం సందర్భంగా దళిత నాయకులు ఎమ్మెల్యేతో కేక్‌ కట్‌ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనువాసులు, హాలహర్వి మండలం కన్వీనర్‌ భీమప్పచౌదరి, మాజీ సర్పంచ్‌ అయ్యాళప్ప, ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, గజ్జెళ్లి కెంచప్ప, నాయకులు పాల్తూరు గోవిందు, వందవాగిలి మేలగిరి, హోటల్‌ తిమ్మయ్య, ఈశా, సౌదిబాషా, రామకృష్ణ, సోమిరెడ్డి, కిష్టప్ప, ఎల్లార్తి చిన్న దరగప్ప, వైకుంఠ, సిద్దేటీ, హెబ్బటం నందీశ, నారాయణ, శీన తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat