తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ప్రభుత్వం గత నాలుగేండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు.
ఈ క్రమంలో నల్గోండ జిల్లాలో గుర్రంపోడు మండలానికి చెందిన కొప్పోలు గ్రామ ఎంపీటీసీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కాంగ్ర్రెస్ పార్టీ ఎంపీటీసీ అయితగోని శంకర్ ను మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. అతనితో పాటుగా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు..