ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర విజయవతంగా కొనసాగుతుంది. కాకినాడలోని జేఎన్‌టీయూ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర నాగమల్లితోట జంక్షన్, సర్పవరం జంక్షన్, ఏపీఐఐసీ కాలనీ మీదుగా అచ్చంపేట జంక్షన్ వరకు కొనసాగింది. అచ్చంపేటలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై సానుకూలంగా స్పందిస్తూ భరోసా ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటున్నారు. రేషన్, ఆధార్‌కార్డు తెమ్మంటున్నారు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడంలేదు. ఏడాది చదువు ఆగిపోతే డిటైన్డ్ అంటున్నారు. పేదలం మా పిల్లలను ఎలా చదివించుకోవాలి? పేదవాళ్లు ఇబ్బంది పడకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలిని కోరుతున్నామని జగన్ తో వారి సమస్య చెప్పకున్నారు. వీరి మాటలకు వైఎస్ జగన్ అక్కా.. ఇంకా ఎంతో దూరం లేదు. ఆరు నెలలు ఓపికపట్టు. మొత్తం వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాం. గట్టిగా దేవుడిని మొక్కు అక్కా, రెండు కొబ్బరికాయలు కొట్టు అని అన్నారు.
