ఏపీలో రాజకీయం చాలా హాట్ గా వెడెక్కుతుంది. ఒకవైపు ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ ఖరారు చేశాడు చినబాబు లోకేష్. వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు నుంచి తిరిగి పోటీ చేస్తారని.. ఆయనను గెలిపించాలని చినబాబు పిలుపునిచ్చాడు. దీంతో ఈ పిలుపు కొత్త రచ్చగా మారింది. దీనిపై టీజీ వెంకటేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థులను ప్రకటించడానికి లోకేష్ ఎవరు? అని కూడా టీజీ ప్రశ్నించేశాడు. అయితే తాజాగ జగన్ కూడ ఈ విషయం పై వైసీపీ నేతలతో చర్చించరంట. ఎందుకంటే ఎస్వీకి గొప్ప పొలిటికల్ కెరీర్ ఏమీలేదు. గత ఎన్నికల్లో వైసీపీ జెండా మీద గెలిచాడు తప్ప ఎస్వీ మోహన్ రెడ్డిని చూసి జిల్లా ప్రజలు ఓటు వేయ్యలేదు అని అన్నారంట. అంంతేకాదు జనాల్లోకి చొచ్చుకెళ్లే చొరవ, ఛరిష్మా రెండూ ఎస్వీకు లేవు కనుక కర్నూల్ జిల్లాలో ఎస్వీ మోహన్ రెడ్డిని అప్పుడు గెలిపించాను..ఇప్పుడు ఓడిస్తా అని వైఎస్ జగన్ వైసీపీ నేతలతో చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎస్వీ కర్నూలు ఎమ్మెల్యేగా, ఈయన మేనకోడలు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరూ వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. వీరిలో ఇప్పుడు ఎస్వీకి టికెట్ ఖరారు అయ్యిందని అనుకోవాలి. అయితే ఎస్వీకి టీడీపీ టికెట్ ఇస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఈయనకు టికెట్ ఇస్తున్నారంటే ఇక కర్నూల్ జిల్లాలో టీడీపీ పతనం అయినట్లే అంటున్నారు సీనియర్ రాజకీయ నాయకులు. అనాడు జిల్లా ప్రజలు నమ్మకంతో గెలిపిస్తే ఈనాడు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే కోట్ల కోసం పార్టీ ఫిరాయించారు అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయారు. కనుక మళ్లీ అదే నియోజక వర్గం నుండి అప్పుడు గెలిపించిన జెండాకు వ్యతీరేకంగా పోటి చేస్తే..ఎలా గెలుస్తాడు..ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు అనేది పెద్ద చర్చ జరుగుతున్నది.
