తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అందులోభాగంగానే 8 వ ప్యాకేజ్ లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ డ్రై రన్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..అతి త్వరలోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను తరలిస్తామని తెలిపారు .కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 6,7,8 పనులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని..ఆరో ప్యాకేజీలో భూగర్భంలో నిర్మిస్తున్న 400 కేవీ గ్యాస్ ఇన్సులెటేడ్ సబ్‌స్టేషన్ కూడా ప్రపంచంలోనే ఈ తరహా తొలి సబ్‌స్టేషన్ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.జూలై 25 లోపు అది పూర్తయ్యే దిశగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఏడో ప్యాకేజీలోని టన్నెల్ పనులకు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నామని ..ఒక్కోటి 25 కిలోమీటర్ల చొప్పున రెండు జంట సొరంగాలు ఉన్నాయని అన్నారు. ఆ లెక్కన మొత్తం పొడవు 50 కిలోమీటర్లు అవుతుందని చెప్పారు. ఇందులో ఇప్పటివరకు 49.988 కిలోమీటర్ల మేర టన్నెళ్లకు ఇప్పటికే గ్రిల్లింగ్ పూర్తిచేశామని తెలిపారు. ఈ మోటరు భారీ పరిమాణం, పనితీరు కారణంగా బాహుబలి మోటార్ గా అందరూ పిలుస్తున్నారు. ఈ డ్రైరన్ విజయవంతం కావడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తమయింది.
Kaleshwaram Project Package-8 Dry Run
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు..రామడుగు మండలం లక్ష్మి పూర్ 8 వ ప్యాకేజీలోని 139 మెగావాట్ల విధ్యుత్ సామర్థ్యంతో పనిచేసే మొదటి పంపు డ్రై రన్.I am elated to announce about the successful Dry-Run of the first Pump-Set of 214 RPM (Revolutions per Minute) which runs with 139 MW electricity power from the 8th Package of #KaleshwaramProject at Lakshmipur of Ramadugu Mandal. Large-scale water pump-sets that run on 139 MW of power. Each Pump that lift-irrigates 3150 cusec water per minute. 7 pumps in Package 8 lift-irrigates 2 TMC of water per day. There are 19 Pumping Stations and 86 Pumps in the entire #KaleshwaramProject.
Publiée par Harish Rao Thanneeru sur Samedi 21 juillet 2018