ఆంధ్రప్రదేశ్‌లో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల్లో జరిగిన ఘోర ప్రమాదాలు మరవకముందే.. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.సంతబొమ్మాళి మండలం ఉమిలాడ సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో బొల్తాపడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బోటులోని ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు.ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైనా వారి కోసం గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఇది ఇలా ఉంటే ఇటీవల గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైనా వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
