ఏపీ అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంద్రుల పరువు తీశారని జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో తన కామెంట్లు చేశారు.’ ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు( చంద్రబాబు) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.
మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి.గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా మాట మార్చారో మీకు తెలియంది కాదు. తద్వారా ఏపీ ప్రజలను నిలకడలేని వాళ్లుగా.. అవకాశవాదులుగా.. ఆత్మగౌరవం లేనివాళ్లుగా దేశస్థాయిలో నిలబెట్టారు’ అని ఆయన ట్విట్టర్లో ద్వజమెత్తారు.