ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మథరం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలుసుకుని.. వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు, 2014 ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదని డ్వాక్రా సంఘాల మహిళలు, రైతులు.., చంద్రబాబు సర్కార్ నియమించిన జన్మభూమి కమిటీలు మొన్నటి వరకు తమకు ఇచ్చే పింఛన్ నగదులో కూడా కమీషన్లను దండుకునే వారని వృద్ధులు ఇలా ప్రతీ ఒక్కరు జగన్‌ను కలిసి చంద్రబాబు సర్కార్ చేస్తున్న అన్యాయాలపై అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా, జగన్ చేస్తున్న పాదయాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. మరో పక్క ఏపీలో సర్వే చేసిన పలు సంస్థలు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టబోతున్నాయంటూ నివేదికలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, నాయకులు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా.. మరికొందరు జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
అయితే, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో యువ బ్రాహ్మణ సంఘం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వారికి వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, వైసీపీలో చేరిన యువ బ్రాహ్మణ సంఘం నాయకుల్లో ఆకెళ్ల మురళీ కృష్ణ, వీఆర్‌జే దిలీప్, భమిడిపాటి మూర్తి, ఎస్.విష్ణుమూర్తి, వేదుల మణిలతోపాటు మరో 45మంది బ్రాహ్మణ సంఘం నాయకులు ఉన్నారు.