కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం, ఈ చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అవిశ్వాసం సందర్భంగా అధికారపక్షంపై నిప్పులు చెరిగిన విపక్ష నేత రాహుల్ గాంధీ అనంతరం ఆశ్చర్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.
బీజేపీ తన ప్రసంగాన్ని అడ్డుతగలడంతో నాపై మీకు ద్వేషం ఉన్నా… మీలో ప్రేమ పుట్టిస్తానంటూ తన ప్రసంగాన్ని ముగించి నేరుగా ప్రధాని దగ్గరకు వెళ్లి ఆయనను కౌగిలించుకోవడం… ఆ తర్వాత తన సీట్లో కూర్చొని పక్కనే ఉన్న ఎంపీకి కన్నుగీటడంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే దీనిపై మంత్రి కేటీఆర్ సెటైర్ అయ్యారు.రాహుల్ తీరుపై వీడియోలు ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ హోరెత్తిపోయాయి. కొందరు హాస్యాన్ని సృష్టింస్తే… మరికొందరు మోడీ ఫ్యాన్స్ ‘ట్రోలింగ్’ చేశారు. ఈ సీన్‌పై సోషల్ మీడియాలో స్పందించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేను ఆ మేజర్ డ్రామాను లైవ్‌గా చూడడం మిస్ అయ్యా… కౌగిలింతలు, కన్నుగొట్టడం, వాక్చాతుర్యం మొదలైనవి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.