దేవరకొండను బంగారు కొండగా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దని రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధి మరియు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. డిండిలో డిండి ప్రాజెక్ట్ నుంచి సాగు నీటిని విడుదల చేసిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ డిండి ప్రాజెక్ట్ కింద రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కేసీఆర్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండిని నింపి సాగు నీటిని విడుదల చేశారని పేర్కొన్నారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకొని తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.దేవరకొండ ప్రాంతం సమైక్య పాలకుల పాలనలో అధోగతి పాలైందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
కన్నా బిడ్డలను అమ్ముకునే ధౌర్భాగ్య పర్ధిస్తితులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దేవరకొండను బంగారు కొండగా మారుస్తామని తెలిపారు. ఈ నెల 25న మూసి ప్రాజెక్ట్ కింద కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఫ్లోరైడ్ నిర్ములన ప్రాజెక్ట్ ఐన డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ పనులు యుద్ద ప్రతి ప్రాతిపదికన జరుగుతున్నాయని పేర్కొన్నారు. నల్లగొండ అధోగతి పలు అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని పేర్కొంటూ జిల్లా నుంచి కాంగ్రెస్ ను ప్రజలు తరిమి కొట్టడానికి సిద్దంగా ఉన్నారని మంత్రి తెలిపారు.