Home / SLIDER / తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి..మంత్రి కేటీఆర్ కీల‌క చ‌ర్చ‌లు

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి..మంత్రి కేటీఆర్ కీల‌క చ‌ర్చ‌లు

తెలంగాణ రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో కీల‌క సంస్థ త‌న వ్యాపార విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు వెల్ల‌డించింది. మంచిర్యాల లోని దేవాపూర్ ప్లాంట్ విస్తరణ చేప‌ట్ట‌నున్న‌ట్లు కంపెనీ సీఈవో కెత్రాపాల్  పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసి వెల్ల‌డించారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లనే నూతన పెట్టుబడులతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న సంస్థలు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది.

ప్రస్తుతం మంచిర్యాలలోని దేవపూర్ లో ఉన్న సీకే బిర్లా గ్రూపు తన సిమెంట్ ఫ్యాక్టరీని సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించేందుకు సిద్ధమైంది. ఈమేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సియివో దీపక్ ఖేత్రపాల్ కలిశారు. ఈ సందర్భంగా కంపెనీ విస్తరణ ప్రణాళికలను మంత్రికి గురించిన ఆయన తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మరియు పెట్టుబడి స్నేహ పూర్వక ప్రభుత్వ విధానాలను అభినందించారు. ఇప్పటికే తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు మొదటి దశ పర్యావరణ, అటవీ శాఖ అనుమతులను పొందినట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు.

త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీశాఖ తుది అనుమతులు లభిస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, ముఖ్యంగా పర్యావరణ శాఖ అనుమతులు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి లభించిన మద్దతును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కంపెనీ విస్తరణ కోసం సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఓరియంట్ సిమెంట్ సీఈవో ఖేత్రపాల్ తెలిపారు. ఈ ప్లాంటు ద్వారా సుమారు నాలుగు వేల మందికి ప్రత్యక్ష ఉపాధితోపాటు పరోక్షంగా మరి 8 వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. పర్యావరణ శాఖ తుది అనుమతులు లభించిన అనంతరం సుమారు మూడు నాలుగు నెలల్లో తాము నిర్మించబోయే ప్లాంట్  నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. నూతన ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఉన్న మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదన సామర్థ్యం 7. 5 మిలియన్ టన్నులకు చేరుతుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకొని అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రంలోకి గత నాలుగు సంవత్సరాలలో వచ్చాయని, నూతన పెట్టుబడులతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక కంపెనీలు, సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నయని అనడానికి ఓరియంట్ సిమెంట్  విస్తరణ ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ప్రభుత్వ విధానాలపైన నమ్మకం ఉంచి, రెండు వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నందుకు మంత్రి కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కంపెనీ విస్తరణ ద్వారా సుమారు నాలుగువేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓరియంట్ సిమెంట్ కంపెనీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు టీఎస్ఎండీసీ, పరిశ్రమల శాఖాధికారులకు అదేశాలు జారీ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat