హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రితం నెల 26వ తేదీన వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దాంతో బాబు గోగినేనిపై దేశద్రోహం .. ఆధార్ చట్టంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే తాను బిగ్ బాస్ షోలో ఉన్నందున విచారణకు హాజరు కాలేనంటూ బాబు గోగినేని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు .. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తును రెండు నెలలపాటు నిలిపివేయవలసిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు వెనక్కి తగ్గడంతో .. బాబు గోగినేని ‘బిగ్ బాస్ షో’లో కొనసాగనున్నారు.
Tags babu gogineni bigboss case high court