మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిక గురించి చర్చించారు.
అయితే, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి.. టీడీపీలో క్రియాశీలకంగా లేరు. ఈ క్రమంలో వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువాకప్పుకోనున్నారు.