భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది.
ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు .తాజాగా ఆమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వార్తల సారాంశం ఏమిటంటే త్వరలోనే ఆమె మరోకర్ని వివాహాం చేసుకోబోతున్నారు అంటూ..!
అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్త అవాస్తవమని సిగర్ సునీత తేల్చేసింది. మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనకు లేదని, ఆ ఆలోచన వచ్చిన వెంటనే.. ఆ విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. తాను పెళ్లి చేసుకోబుతున్నానంటూ కొన్ని సోషల్ మీడియా వెబ్‌సైట్లు రాయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఏం పిచ్చి..పిచ్చిగా ఉందంటూ ఫైర్ అయ్యారు కూడాను.