Home / POLITICS / పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్ కీలక సమీక్ష

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్ కీలక సమీక్ష

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొన్ని రాజకీయపక్షాలు కోర్టు కేసులతో అడ్డుకుంటున్నాయని, ఈ కేసులు ఓ కొలిక్కి వస్తే…కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిగెత్తిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ ఆయన జల సౌధలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులోని 18 ప్యాకేజీలలో జరుగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్ష జరిపారు. ప్యాకేజీ -1 లో 66 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి గాను 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి చేసినట్లు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ఈ ప్యాకేజీలోని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్, టన్నెల నిర్మాణ పనులు, గ్రావిటీ కెనాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తే మహబూబ్ నగర్ జిల్లా వాసులకు వచ్చే వేసవలిలో దాహార్తి తీర్చేందుకు తాగు నీటిని ఇవ్వవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అటవీ భూముల సేకరణకు అవసరమైన 49 కోట్లును వెంటనె చెల్లించాలని ఆదేశించారు. రిజర్వాయర్ పనులు, టన్నెల్ పనులు, సర్జ్ పూల్, పంప్ హౌస్ పనుల వేగం మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ప్యాకేజీ-1 పనులనూ పూర్తి చేయడాన్ని ప్రాధాన్యతా అంశంగా పరిగణించి ఇంజనీర్లు పని చేయాలని సూచించారు. ప్యాకేజీ-2 లో అంజనాగిరి రిజర్వాయర్ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. ఈ రిజర్వాయర్ పరిధిలో మూడు రీచ్ లు ఏర్పాటు చేసిన పనులు నిర్వహిస్తున్నట్లు తెలపగా…రీచ్ ల వారీగా పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రీచ్ -1 లో పనులు వేగంగా జరుగుతున్నాయని, రీచ్ -2, రీచ్ – 3ల లో రిజర్వాయర్ బండ్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీచ్ -2 లో మట్టి సమస్య నెలకొందని ఇంజనీర్లు తెలిపారు.

రాక్ ఫిల్ డ్యామ్ సాంకేతికను పరిశీలించండి….
—————————————————-
రీచ్ -2 లో ఏర్పడిన మట్టి కొరత సమస్యను అధిగమించడానికి రాక్ ఫిల్ డామ్ విధానంలో పనులు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఇదే విధానంలో తెహ్రీ డ్యామ్ నిర్మించారన్నారు. బండ్ మట్టిలో సమస్య ఏర్పడినపుడు ర్యాక్ ఫిల్ డామ్ విధానం ద్వారా అక్కడి రాళ్లతోను, మట్టితోను నిర్మించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద ర్యాక్ ఫిల్ డామ్ తెహ్రీ డామ్ అని చెప్పారు. దీనిపై ఇప్పటికే తెహ్రీ డ్యామ్ ఇంజనీర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాలమూరు- ఎత్తిపోతల పథకం ఇంజనీర్లు మంత్రికి వివరించారు. సాంకేితక అంశాలపైన దృష్టి సారించాలని మంత్రి వారికి సూచించారు. దీనిపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో పాటు డైవర్షన్ రోడ్స్ నిర్మాణ పనులు ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఎజెన్సీలకు అప్పగించాలా..లేక.. ఆర్ అండ్ బి శాఖతో చేయించాలన్న దానిపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. దీంతో పాటు ఈ ప్యాకేజీలో ఎలక్ట్రికల్ టవర్స్ ను మార్చేందుకు అవసరమైన 18 కోట్ల నిధుల మంజూరుకు సైతం ప్రతిపాదనలు పంపాలని చెప్పాారు. ఈ ప్యాకేజీలో ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 199 ఇళ్లకు ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తయ్యాయని, మిగతా 110 ఇళ్లకు ఇవ్వాల్సి ఉందని ఇంజనీర్లు తెలిపారు. దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ… సంబంధింత జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో పాటు భూసేకరణ ప్రత్యేక అధికారి మనోహర్ తో సంప్రదించి ఆర్ అండ్ ఆర్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్యాకేజీ -3 లో ఓపెన్, అప్రోచ్ కెనాల్ పనులు చేపడుతున్నామని ఇంజనీర్లు తెలిపారు. ఇందులో 8 కిలోమీటర్లకు గాను 3 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ పనులు పూర్తి చేసినట్లు వివరించారు.ఈ ప్యాకేజీలో ఆరు కోట్ల మట్టి పని జరిగిందని, స్ట్రక్చర్ల నిర్మాణ పనుల వేగం పెంచాలని మంత్రి ఇంజనీర్లను, ఏజెన్సీలను ఆదేశించారు. ఈ
ప్యాకేజీలో భూసేకరణ ఇంకా జరపాల్సి ఉందని ఇంజనీర్లు తెలపగా ఆ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ-4 లో రెండు టన్నెల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రికి ఇంజనీర్లు వివరించారు. ఇందులో 15 కిలోమీటర్లకు గాను కుడి టన్నెల్ లో 7.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయ్యాయని, ఎడమవైపు టన్నెల్ లో నాలుగున్న కిలోమీటర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ టన్నెల్ పనులు ప్రాధాన్యతక్రమంలో చేపట్టాలని…ముందుగా నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్న టన్నెల్ పై దృష్టి పెట్టి పనులు వేగం పెంచాలన్నారు. ఈ ప్యాకేజీలో మరో 147 ఎకరాలు సేకరించాల్సి ఉందని ఆ పనులు చేపట్టాలన్నారు. ప్యాకేజీ-5 లో తీగలపల్లి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్ పనులు
జరుగుతున్న తీరుపట్ల మంత్రి హరీశ్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీ-6లో వీరాంజనేయ రిజర్వాయర్, అప్రోచ్, ఓపెన్ కెనాల్ పనులు నిర్వహిస్తున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ రివిట్మెంట్ పనులు వేగంగా చేపట్టాలన్నారు. ఈ ప్యాకేజీ పరిధిలో బట్రాయిపల్లి, కొంకలపల్లిలో ఆర్ అండ్ ఆర్ పనుల్లో జాప్యం జరుగుతుందని ఈ సమస్యపై దృష్టి సారించాలని మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను ఆదేశించారు. ఈ ఆర్ అండ్ ఆర్ సమస్యను తొలిగిపోతే ఈ రిజర్వాయర్ లో నీరు నింపవచ్చని చెప్పారు. ప్యాకేజీ -7 కింద రెండు టన్నెల్స్ నిర్మాణం చేపడుతున్నామని ఇందులో కుడి టన్నెల్ 1.5 కిలోమీటర్లు పూర్తయిందని ఇంజనీర్లు వివరించారు.ఈ టన్నెల్ పనుల వేగం తగ్గిందని…ప్రణాళికా బద్దంగా పనులు చేపట్టి త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ-8లో భాగంగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్ పనులు జరుగుతున్న తీరుపైన మంత్రి కొంత సంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీ-9 కింద వెంకటాద్రి రిజర్వాయర్ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ఈ రిజర్వాయర్ బండ్ పనులు 6.5 కిలోమీటర్లకు గాను 5 కిలోమీటర్ల వరకు బండ్ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. 3.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి గాను 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరిగిందని చెప్పారు. ఇందులో 380 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్యాకేజీ పనుల వేగం పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ప్యాకేజీ-10, ప్యాకేజీ 11 లో వెంకటాద్రి రిజర్వాయర్ పనులు ఉన్నాయని వీటిలో భూసేకరణ , ఆర్ అండ్ ఆర్ సమస్యలు మిగిలి ఉన్నాయని చెప్పారు. రిజర్వాయర్ బండ్ పనులపై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి ఇంజనీర్లకు సూచించారు. ప్యాకేజీ-12 లో ఓపెన్, అప్రోచ్ కెనాల్ పనులు నిర్విహిస్తున్నామని, ఇందుోల కోటీ 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనికి గాను, కోటీ 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయిందని ఇంజనీర్లు మంత్రికి వివరించారు. హెడ్ రెగ్యూలేటర్ పనులు వేగంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

రిజర్వాయర్ పనుల నాణ్యత లో రాజీ వద్దు…
——————————————-

ప్యాకేజీ 13, 14,15 కింద కర్వె న రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రి హరీశ్ రావుకు వివరించారు. ఈ ప్యాకేజీలో 4.5 కిలోమీటర్ల వరకు బండ్ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ల పనుల విషయంలో అత్యంత అప్రమత్తత పాటించాలని మంత్రి ఇంజనీర్లును ఆదేశించారు. పెద్ద రిజర్వాయర్లు కావడం వల్ల ఎలాంటి నాణ్యత లోపాలున్నా…. ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, ఎజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పూర్తి అప్రమత్తతతో పని చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. ప్యాకేజీ 16 కింద ఉద్దండాపూర్ పంప్ హౌస్, ప్యాకేజీ 17,18 కింద ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ఇందులో 17 కిలోమీటర్ల టన్నెల్ కు గాను 4 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయిందని, ఇంకా 13 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉందన్నారు. రైల్వే క్రాసింగ్ లైన్,నేషనల్ హైవే… ఉండటంతో పనులకు కొంత జాప్యం కలిగిందని వివరించారు. ముందుగా ఒక టన్నెల్ పై దృష్టి సారించి పూర్తి చేయాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. భద్రత విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రక్షణ ఏర్పాట్లతోనే పనులు జరిపేలా సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat