ఏపీ లోని విజయవాడలో ఓ హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్నవారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బినామీ ఈ హోటల్ నిర్వహిస్తున్నాడని పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేసి ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని వెల్లడించారు. ఐదుగురు యువతులను, 50 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వైద్య వృత్తిని అభ్యసిస్తున్నవారే అధికంగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు చెప్పారు. అలాగే మరికొంతమంది స్థానికంగా ఉన్న ఛానళ్ళలో యాంకరింగ్ చేస్తున్నవారు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడిలో దొరికిన అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అరెస్టయిన వారందరినీ పలు స్టేషన్లకు తలరించమని పోలీసులు తెలిపారు.
