పాశ్చాత్య సంస్కృతికి యువతీయువకులు బాగా అలవాటుపడిపోయారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు . వైద్యవృత్తి చదువుతున్న కొంతమంది యువతీయువకులు నగరంలోని భవానీపురంలో ఓ హోటల్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో పట్టుబడిన తొలి ముజ్రా పార్టీగా పోలీసులు దీన్ని రిజిస్టర్ చేశారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. హోటల్ నుంచి విపరీతమైన సౌండ్‌లు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటలుకు వచ్చి లోపల జరుగుతున్న తంతును చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కొంతమంది యువతులు మద్యం మత్తులో అర్థనగ్నంగా నిలబడి డ్యాన్సులు చేస్తూ కనిపించారు. అరెస్టయిన వారిలో ఈవెంట్ యాంకర్లతో పాటు హైదరాబాద్, భీమవరం ప్రాంతాల నుంచి తెప్పించిన అమ్మాయిలు ఉన్నారని, వారిని వాసవ్య మహిళా మండలికి అప్పగించామని పోలీసులు వెల్లడించారు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులైన కొల్లూరు రామకృష్ణ, సామా చైతన్యలతో పాటు స్థానిక తెలుగు యువత నేతలు, వ్యాపారులు కూడా ఉన్నారు. జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో దాడులు జరుగగా, అక్కడ పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారందరినీ పలు స్టేషన్లకు తలరించారు.
