ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ కడప జిల్లా ఇడుపులపాయ నుండి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర
ప్రారంభించారు. ఇప్పటికి వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’216 రోజులుగా విజయవతంగా కొనసాగుతుంది. ‘జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలు చాలా బావున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, దేవుని ఆశీర్వాదంతో జగన్ అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మరిపించే విధంగా ఆయన పాలన ఉండబోతోందని ,అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మా శాయశక్తులా కృషి చేస్తాం’అని ఎందరో వైసీపీలోకి చేరుతున్నారు.
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ..ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 22 మంది వైసీపీలో గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారనేది నగ్న సత్యం. ఎన్నో సార్ల్ వైసీపీ నేతలు కూడ విమర్శంచారు. అయిన వారి తీరు మారలేదు. కనుక పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఓ ఎమ్మెల్యేతో వచ్చే ఎన్నికల్లో ఏం బయపడకండి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము..అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ బలం పెరుగుతుందని చెప్పారంట. ఇంకా గత ఎన్నికల్లో మన పార్టీ తరుపున గెలిచి టీడీపీలో చేరిన 22 మందిలో ఒక్కరిని కూడ గెలవనియ్యాను అని అన్నారంట. ఈ మాటలతో జగన్ ధైర్యానికి ఆ ఎమ్మెల్యే సలాం చేశారంట. ఏది ఏమైన వచ్చే ఎన్నికలు చాల రసవత్తరంగా సాగే విధంగా ఉన్నాయి. చూడలి మరి ఏం జరుగుతుందో..!