ఢిల్లీలోని పార్లమెంట్ వేదికగా వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. మరో పక్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలందరిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ తరుపున మాట్లాడేందుకు పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇద్దరికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్చలో పాల్గొనాలని గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించి.. పార్లమెంట్‌లో మాట్లాడాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయం కాస్తా.. విజయవాడ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహంకు తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అవిశ్వాస నోటీసు ఇచ్చిన తనకు చంద్రబాబు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం.. తనను చాలా బాధకు గురి చేసిందని ఎంపీ కేశినేని తన సహచరులతో అన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇవాళ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో తన ప్రసంగాన్ని మొదలు పెడుతూ.. అచ్చం భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పిన మేడమ్స్ స్పీకర్ అనే డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. తాను కూడా పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను మేడమ్స్ స్పీకర్ అని సంబోధించారు. అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని లేకపోవడం డాన్ని తాము ప్రశ్నించడం లేదని, ఏపీ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నట్టు ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ సమావేశాలను అమరావతిలో ప్రత్యేకంగా వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ ప్రసంగం ముగిసిన వెంటనే ఫోన్ చేసి.. తన ప్రసంగంలో ప్రత్యేక హోదాకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే, రాజధాని నిర్మాణానికి గల్లాజయదేవ్ తన ప్రసంగంలో ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ఏమిటని.. గల్లా జయదేవ్‌ను చెడామడా తిట్టినట్టు సమాచారం.