ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ రేపు శుక్రవారం లోక్ సభలో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ.అయితే నిన్న బుధవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో రేపు జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు మాట్లాడాల్సిందిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. దీంతో అవిశ్వాస తీర్మాన నోటీసులిచ్చిన ఎంపీ కేశినేని నాని ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అయితే పార్లమెంటరీ నేతగా..సీనియర్ నేతగా ఉన్న తనని కాదని నిన్నకాక మొన్న వచ్చిన యువఎంపీ గల్లా జయదేవ్ కు అవకాశం ఎలా ఇస్తారు అంటూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు 2014 ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎంపీ తోట నరసింహాం. పార్టీలో ఉన్న సీనియర్లకు సరైన ప్రధాన్యత లేదని..తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారు ..పార్టీలో ఉండి తీవ్ర అవమానాలకు గురి అవ్వడం కంటే పార్టీ మారడమే బెటరని ఆయన ఆలోచిస్తున్నారు అని ఆయన అనుచరవర్గం అంటున్నారు.
అయితే ఇప్పటికే ఎంపీ తోట నరసింహం గత కొంతకాలంగా అధికార టీడీపీ పార్టీ కార్యక్రమాలకు ,అధికారక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు .ఈ నేపథ్యంలోనే తోట నరసింహం గురించి ఏర్పాటు చేస్తున్న పలు కటౌట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ఫోటోలు లేకుండా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.అయితే తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో త్వరలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఆయన పార్టీ మారడం ఖాయమని టీడీపీ వర్గాలే కోడై కూస్తున్నారు..