ఏపీ అధికారక టీడీపీ పార్టీకి చెందిన నేత,అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు గురువారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు హజరు కావడంలేదని తేల్చి చెప్పారు..తాజాగా ఆయన గురించి ఒక వార్త జిల్లా టీడీపీ వర్గాల్ హాల్ చల్ చేస్తుంది.
ఈ వార్తల సారాంశం ఏమిటంటే జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరబోతున్నారు. ఆయన టీడీపీ పార్టీలో చేరడాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అంతేకాకుండా పార్టీలో ఉన్న ఎంపీలను టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా కింది స్థాయి నేతల వరకు అసలు గౌరవించడంలేదు.
అసలు మాకు ప్రధాన్యత లేదు అని కూడా ఆయన తీవ్ర నిరాశక్తితో ఉన్నారు.. దీంతో ఈ నెల ఇరవై ఐదో తారిఖులోపు చంద్రబాబు నాయుడు స్పందించకపోతే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తా అని ఆయన అల్టిమేటం జారీ చేశారు అని ఈ వార్తల సారంశం. చూడాలి మరి జేసీ రాజీనామా చేస్తారో లేదో..