ఏపీలో రాజధాని ప్రాంతానికి దగ్గరలో విజయవాడనగరంలోని భవానీపురంలో ఉన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతకు చెందిన ఒక ప్రముఖ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఆ హోటల్లో మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేసి..
ఐదుగురు ప్రముఖ తెలుగు యాంకర్లుగా పని చేస్తున్న మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన సదరు నేత ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో ఈ హోటల్లో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలోని భీమవరం,విజయవాడకు చెందిన కొందరు ఈ యాంకర్లను తీసుకువచ్చి హోటల్లో అసభ్య నృత్యాలు నిర్వహించారని సమాచారం.అంతేకాకుండా వ్యభిచారం కూడా జరిగుతుందని పక్కా సమచారంతో పోలీసులు దాడి నిర్వహించారు.అయితే ఈ దాడిలో మరో ఐదుగురు యాంకర్లని
తప్పించినట్లు సమాచారం..