ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్‌ను భరించలేకనే ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి పొంది అధికారం చేపట్టాలనే దురహంకారంతో చాలా మందిని చంద్రబాబు చంపేశాడు అంటూ ఇటీవల కాలంలో టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియా సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే.
అలా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తూ చంద్రబాబు టార్చర్ భరించలేక మరో నేత రాజకీయాలకు దూరం కాబోతున్నారా…? అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనా..? ఆయన్ను చంద్రబాబు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? ఇంతకీ ఆ టీడీపీ సీనియర్ ఎవరు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ కథనం పూర్తగా చదవాల్సిందే..!
ఇక అసలు విషయానికొస్తే.. బుచ్చయ్య చౌదరి టీడీపీ ఆవిర్భావం నుంచి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. అంతెందుకు, టీడీపీలో చంద్రబాబుకంటే బుచ్చయ్య చౌదరినే సీనియర్ నేతగా ఉన్నారు. అయితే, ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో అతి త్వరలో రాజకీయాలకు దూరం కాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు యత్నించిన బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు షాక్ ఇస్తూ.. ఆ సీటును బీజేపీ అభ్యర్థికి కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో చేసేది లేక బుచ్చయ్య చౌదరి రూరల్ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరికి రూరల్ సీటు కూడా దక్కకుండా చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలను ముమ్మరం చేశారట. అందులో భాగంగానే చంద్రబాబు గుడా చైర్మన్ గన్ని కృష్ణను రంగంలోకి దించారని సమాచారం.
అయితే, బుధవారం సాయంత్రం రాజమండ్రి టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ జగన్‌పై విమర్శల వర్షం కురిపించిన వెంటనే.. బుచ్చయ్య చౌదరికి తన అనుచరులు ఈ సమాచారన్ని చేర వేశారట. దీంతో బుచ్చయ్య చౌదరికి ఏమీ చేయాలో పాలుపోక డీలా పడ్డారని సమాచారం.