జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖాతాలో ఓ టీవీ చానల్ చేరిందనే విషయం రుజువు అయింది. కొద్దికాలంగా చర్చలకు పరిమితం అయిన ఇటీవలే అవును అనే రీతిలో ముగింపునకు వచ్చిన 99 టీవీ పవన్ కళ్యాణ్‌దని తేలింది. సవ్యంగా పవన్ మన చానలే అని ప్రకటించడంతో జనసేనాని చేతికి ఓ మీడియా సంస్థ వచ్చిన విషయం రూడీ అయింది.
గతంలోనే 99 టీవీ చానల్‌ను కొనుగోలు చేసేందుకు పవన్ సిద్ధమయినట్లు ప్రచారం జరిగింది. డీల్ కుదిరిందని..చెల్లింపులే ఆలస్యమని వార్తలు చెలామణిలోకి వచ్చినప్పటికీ ఈ కొనుగోలు జరగలేదు. కొద్దికాలం తర్వాత ఆ ప్రకటనే నిజమయింది. సీపీఐ నేతల చేతుల్లో ఉన్న 99 టీవీ ఛానల్‌ను పవన్ పార్టీకి మాజీ ఐఏఎస్, జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆయనకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. అలా జనసేనకు పరోక్షంగా ఓ మీడియా చానల్ వచ్చింది. అయితే దీని గురించి చర్చలే తప్ప పవన్ ప్రకటించింది ఎక్కడా లేదు. కాగా, పవన్ స్వయంగా 99 టీవీ చానల్ జనసేనదని ప్రకటించారు. హైదరాబాద్ లో జనసేన ఐటీ సెంటర్‌ను పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ సందర్కబఃగా పలు మీడియా సంస్థలు ఈ కార్యక్రమానికి హాజరవగా..పవన్ 99 టీవీ ఛానల్ లోగోను చూస్తూ…“ఓహ్..మనదే. మనదే“ అంటూ పేర్కొన్నారు. పవన్ స్వతహాగా అంగీకరించడంతో…ఛానల్ విషయంలో స్పష్టత వచ్చిందంటున్నారు.
కాగా, ఐఏఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ 2008లో వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని పీఆర్పీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన 2009లో పీఆర్పీ టికెట్‌తో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీలో చేరి రాజకీయ భవిష్యత్ వెతుకున్నప్పటికీ అది కలిసి రాలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పి ఇటీవలే జనసేనలో చేరారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.