తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి గురువారం రెండు వేర్వేరు నోటీఫికేషన్లు TSPSC జారీ చేసింది . GHMCలో 124 బిల్ కలెక్టర్లు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లో పలు విభాగాల్లో 78 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని గ్రూప్ -4లో విలీనం చేయాలని భావించినా ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా ఉండటంతో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వాలని TSPSC నిర్ణయించింది . త్వరలోనే హెల్త్ అసిస్టెంట్, శానిటరీ సూపర్ వైజర్ ఉద్యోగాలతో 85 ఉద్యోగాలకు మరో ప్రకటన ఇచ్చేందుకు కసరత్తు పూర్తిచేసినట్లు తెలిపింది.
