మాస్ హీరో కాస్త క్లాస్‌గా మారిపోయాడు. ఇన్నోవేటెడ్ స్టోరీస్‌తో వరుస విజయాలను అందుకున్నాడు. బుల్లితెరపై కూడా మెప్పించాడు. ఇప్పుడు ఆ హీరో మళ్లీ తన పాత ట్రెండ్‌కు వెళ్లబోతున్నాడు. కత్తులు, బాంబులను నమ్ముకుంటున్నాడు. స్ర్కీన్‌పై మరోసారి మంటలను పుట్టిస్తానంటున్నాడు. ఆ హీరోనే నటరుద్రడు నందమూరి తారక రామారావు.
యంగ్ టైగర్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోస్‌లో ఒక్కడు. ఆది సినిమాతో మాస్ హీరోగా బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాడు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ హిట్స్‌తోపాటు డిజాస్టర్స్ మూటగట్టుకున్నాడు. ఆ తరువాత కాస్త స్టైల్ మార్చి కత్తులు, సుమోలు వదిలేసి డిఫరెంట్ క్యారెక్టర్స్‌పై ఫోకస్‌పెట్టి విజయాలను అందుకుంటున్నాడు.
అయితే, ఎన్టీఆర్ తన రూట్‌లోకి వెళుతున్నాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ అని ముందు నుంచి వినిపించడంతోపాటు ఫస్ట్‌లుక్‌లో సైతం చొక్కా లేకుండా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో ఏదో భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉందనేలా క్లూ ఇవ్వడంతో అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.
ఇదిలా ఉండగా, ఫిల్మ్‌నగర్ సమాచారం మేరకు ఇందులో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా ఉండబోతోండట. ఈ మధ్య సినిమాలో మాస్‌ను ఉర్రూతలూగించే ఇలాంటి ట్రాక్ రాలేదని యూనిట్ సభ్యులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్‌కు ఫ్లాష్‌బ్యాక్ గుర్తుకొస్తోంది.