Home / POLITICS / ఏ అండా లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండా..!!

ఏ అండా లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండా..!!

రాష్ట్రంలో ఉన్న  అన్ని వర్గాలను వారి వారి అర్హ‌త‌లు, ప‌రిస్థితుల ఆధారంగా ఆర్థిక పరిపుష్టి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే బీసీ ల్లో యాదవులకు,కురుమలకు గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేసింది. బీసీల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు సేకరించిన నేపథ్యంలో మంత్రి ఆయా వర్గాలతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు గుర్తించని కులాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడమే కాదు స్పీకర్ మధుసూదనాచారీ అధ్యక్షతన అసెంబ్లీ వేదికగా సమావేశం ఏర్పాటు చేయించిన ఘనత సీఎం కేసీఆర్ గారిది అని ఈటల అన్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపిఆర్ గార్డెన్స్ లో హుజురాబాద్ నియోజకవర్గ బిసి, ఎస్సి,ఎస్టీ కుల సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంచారజాతులు ఊరు-వాడ లేకుంటా తీరుతారు వారికి ఓట్లు లేవని ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు కానీ మేము సంచార జాతుల వారందిరికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి అన్నారు. వారి పిల్లలకు ప్రవేశ పరీక్ష లేకుండా రెసిడెన్సియల్ స్కూల్స్ లో సీట్లు ఇప్పిస్తామని మంత్రి అన్నారు. కుల వృత్తులు చేసే వారందరికీ వ్యక్తిగతంగా, గ్రూప్ లోన్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. వచ్చే నెల రోజుల్లో సీఎం గారి చేతులమీదుగా బీసీల  లోన్ల పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఇదే విధంగా ఎస్సీ కూడా లోన్లుఅందిస్తామన్నారు. చిన్నమొత్తంలో రుణం అవసరం అయినవారికి బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా లభ్డిదారులకే ఋణం అందిస్తామని, ఎక్కువ మొత్తం లో పెట్టుబడి అవసరం అయినవారికి ప్రభుత్వమే గ్యారెంటీ ఉండి ఋణం అందేలా చూస్తామని మంత్రి ఈట‌ల‌ చెప్పారు.

`ఇవ్వాళ్టికి కూడా కడు బీదరికంలో,రెక్కల కష్టం మీద బ్రతికే వారు ఎవరు అంటే ఎస్సి,ఎస్టీలు వారు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కూడా దళితులకు  ప్రాధాన్యత ఇస్తాం. గ్రామాల్లో ఎక్కడ అయ్యితే భూమి అమ్మేది ఉన్నదో ఆ భూమిని కొని కడు పేదరికంలో ఉన్న దళితులకు మూడు ఎకరాల భూమి మేమే కొని ఇస్తాం. 95 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు,100 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్ హౌస్  లాంటివి కూడా దళితులకు ఇస్తాం. మమ్ముల్ని ఎవరు పట్టించుకుంటారు అనే ఆలోచనలో ఉన్న మీ అందరికీ నేనే అండ, నేనే మీ లీడర్, 24 గంటలు వారికి అందుబాటులో ఉంటా` అని అన్నారు. హుజురాబాద్ మినిస్టర్ క్యాంపు ఆఫీస్ లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇద్దరు PA లు అందుబాటులో ఉంటారని, లోన్ల అప్లికేషన్స్ నింపడం రాని వారికి వారే నింపి ఇస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అనాథలకు సైతం మాకు ఎవరు లేరు అనే భావన  పోయింది అని మంత్రి అన్నారు. `ఒకప్పుడు గొప్పగా బ్రతికిన కులాలు ఈ నాడు చితికి పోయినాయి. వారికి మేము అండగా ఉంటాం.సాధారణంగా లోన్లు ఇవ్వాలని మీరు మా దగ్గరికి వస్తారు.. కానీ నేనే మీ దగ్గరికి వచ్చి లోన్లు ఇస్తున్న. గతంలో బ్యాంక్ లింక్ ఉండే ఇప్పుడు ఆ బాధ లేదు నేరుగా మీకే చెక్ అందిస్తాం` అని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat