ఎంఎస్ ధోనీ టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్ళ తర్వాత అంతగా పాపులారీటీని సంపాదించుకున్న ఆటగాడు. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నుండి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ వరకు.. టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానం నుండి వన్డే క్రికెట్లో నెంబర్ వన్ స్థానం వరకు టీం ఇండియాను నిలబెట్టిన మాజీ కెప్టెన్..
అయితే సరిగ్గా మూడున్నరేళ్ళ కింద టెస్ట్ క్రికెటుకి గుడ్ బై చెప్పిన ధోనీ తాజాగా వన్డే క్రికెటుకి కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నరా అంటే అవును అనే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..ఇంగ్లాండ్ తో మూడో వన్డే మ్యాచ్ అనంతరం ధోనీ పెవిలియన్ కి వచ్చే క్రమంలో ధోనీ అంపెర్ ను అడిగి మరి బంతిని తీసుకున్నాడు.
అయితే మ్యాచ్ గెలిస్తే వికెట్లను తీసుకోని వచ్చే అలవాటున్న ధోనీ తాజా చర్యతో ఆయన వన్డే క్రికెట్ కి కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇంగ్లాండ్ తో ఆడిన ఈ మ్యాచ్ నే చివరి మ్యాచ్ అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ వీళ్ళు చెప్పిందే నిజమైతే ఇది ఖచ్చితంగా ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..