ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార విపక్ష పార్టీలైన టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే.. అయితే టీడీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్యేలలో సగానికి సగమంది కేవలం ఐదు వందల నుండి రెండు వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు.
గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై ప్రతిపక్ష పార్టీలు అయిన వైసీపీ,బీజేపీ,కాంగ్రెస్ ,వామపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో..ఎవరికెన్ని స్థానాలు వస్తాయో తేల్చి చెప్పారు.
ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బె తగులుతుంది. గత నాలుగేళ్ళుగా టీడీపీ ప్రభుత్వ హాయంలో ఏపీలో ఏం జరుగుతుందో ప్రజలు అందరికీ తెలుసు. ఎవరికీ ఏం తెలియదు అనుకుంటే అది టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మూర్ఖత్వం. తన ఆస్థాన మీడియాతో దాన్ని కవర్ చేయొచ్చు అనుకుంటే అది ఆయన ఇంకా మూర్ఖత్వం అవుతుంది.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. గత ఎన్నికల్లో పవన్ మద్దతు వల్ల చంద్రబాబుకు కొందరు ఓటేశారు. ఈ రోజున పవన్ టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు పడిన ఓట్లు మళ్లీ పడవు కదా. ఆ ఓట్లలో కొన్ని పవన్‌కు, కొన్ని మాకు వస్తాయి.
గతంలో ఉన్న మా ఓటు షేర్ మాకు ఎలాను ఉంటుంది. ఈ సారి ఇంకా పెరుగుతుంది. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ, చంద్రబాబు చేసిన మోసంలో భాగస్వామ్యులే కదా. తప్పు అయిపోయింది అని చాలా సులభంగా చెప్పారు. ఒక మనిషిని ముగ్గురు వ్యక్తులు కలసి పొడిచేసిన తర్వాత అందులో ఒకరు నాది తప్పైంది అంటాడు. రెండు వ్యక్తి ఏమో నేను మోసపోయాను అంటాడు. ఇక మిగిలిన మూడో వ్యక్తి ఎవరు?. నాలుగేళ్లు సైలెంట్‌గా ఉండి, ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్తే ఎలా?. ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 40 సీట్లు కూడా రావు.మాకు మాత్రం నూట ముప్పై స్థానాలు ఖాయమని తేల్చి చెప్పారు..