ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ పావులు కదుపుతుంది. రాష్ర్టంలో ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ మరింత పుంజుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అమలుకాని 600 అపద్దపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎన్నో సార్లు మీడియా ముందు వైసీపీ నేతలు తెలిపారు. దీనికితోడు టీడీపీకి ఎలాంటి షరతుల్లేకుండా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మద్దతు ఇచ్చారు. టీడీపీ-బీజేపీ కలసి రాష్ర్టంలో, దేశంలో అధికారాన్ని పంచుకున్నాయి. పవన్‌కల్యాణ్ కూడా నాలుగేళ్ల పాటు టీడీపీని వెనుకేసుకొచ్చారు.
అయితే ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక్కడే విభజన హామీల్లో ప్రధానంగా ప్రత్యేకహోదా కోసం గత నాలుగేళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు . యువభేరీలు, నిరశన కార్యక్రమాలు చేశారు. అంతేకాదు ప్రత్యేకహోదా అంశం, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం దేశాన్ని ఒక కుదుపు కుదిపాయని చెప్పవచ్చు. అయితే జగన్ పోరాటం ఇప్పుడు నేటి యువతకు బాగ అర్థమయ్యింది. పెద్ద పెద్ద చదువులు చదువుకని ఇంటి దగ్గర ఉంటూ..ఏంతోమంది నిరుద్యోగులుగా ఉండి పోయారు. వారి కోసం అలుపనేది లేకుండా కష్టపడుతున్నాడు. మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాతం అయితే మరి దారుణంగా ఉంది. ఎక్కడ చూసిన కరువు..రైతులకు అన్యాయం.. నిరుద్యోగ సమస్య ఇలా ప్రతి సయస్యలకు అదికారంలో ఉన్న టీడీపీ పార్టీ న్యాయం చేయలేక పోయింది. దీంతో ఇటీవలనే బీజేపీ నుండి వైసీపీలో చేరిన కాటసాని వైసీపీ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకేళ్లుతున్నాడు. ఏ పట్టణం చూసిన..ఏ గ్రామంలో అడిగిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉందని జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాదు కాటసాని అసలు టీడీపీ చేస్తున్న పాలనపై ..వైసీపీ చేసే పాలనపై క్లూప్తంగా ప్రజలకు వివరిస్తున్నాడంట. జిల్లాలోని ప్రజల సమస్యలను జగన్ తో చెబుతున్నారంట. తప్పకుండా అందరికి న్యాయం చెద్దాం అని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని దీమాతో ఉన్నారంట.