ఏపీలో ఎన్నికలు జరిగితే మొత్తం 175 నియోజకవర్గాల్లో కనీసం 40 సీట్లు కూడా అధికారంలో ఉన్న టీడీపీ కి రావని ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ ఓ చానళ్లుకు ఇచ్చిన ఇంటర్వులో అదికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఎలా మోసం చేశారన్నది ప్రజలకు తెలియదని అనుకుంటే అదే వారి మూర్ఖత్వమే అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీకి 40 సీట్లు కూడా రావని తాను రాసిస్తా అని జగన్ అన్నారు. అంతుకాదు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పెత్తుపెట్టుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశాడు.. దేవుడు కరుణిస్తే, ప్రజలు కోరుకుంటే తాను అధికారంలోకి వస్తానని అన్నారు. ఇంకా నేను లక్ష కోట్లు తిన్నానని ఆరోపిస్తున్నారు… నిరూపించగలరా? అని ప్రశ్నించారు . లక్ష కోట్లు… లక్ష కోట్లు… అని పదేపదే చెప్పి నమ్మేలా చేశారని ,2014లో చంద్రబాబును జనసేన, బీజేపీ గెలిపించాయన్నారు. చంద్రబాబు అవినీతి పరుడని పవన్ ఇప్పుడు బాధపడడంలో అర్థంలేదని సెటైర్లు వేశాడు… 2014లో అన్ని కలిసివచ్చి చంద్రబాబు గెలిచారని వైఎస్ జగన్ అన్నారు
