ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా జననేత ఇప్పటివరకు 2,550.9 కిలోమీటర్లు నడిచారు. వైఎస్ జగన్ కాకినాడ సంతాచెరువు వద్ద భారీ బహీరంగా సభ నిర్వహించారు. ఈ సభలో కాకినాడ పార్టమెంట్ అధ్యక్షుడు కన్నాబాబు మాట్లడుతూ..మా కాకినాడకి లశేశ జనవాహినితో పాదయాత్రగా వచ్చిన వైఎస్ జగన్ కు మన అందరిని తరుపున స్వాగతం పలుకుతున్నాము అని అన్నారు. మాములుగా సింహాలను. సర్కస్ లో,బోనులో చూస్తే దాని విలువ తెలియదు. సింహాన్ని చూడలంటే అడవిలో చూడలి..జగన్ చూడలంటే జనంలో చూడలి అని అన్నారు.
