ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ కాకినాడ సంతచెరువు వద్ద భారీ బహీరంగా సభ నిర్వహించారు. ఈ సభలో జగన్ మాట్లడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢీల్లిలో రాజీనామాలు చేసి వచ్చారు. అవిశ్వాసాలు పెట్టి రాజీనామాలు చేసి వైసీపీ ఏంపీలు వచ్చారు. కాని చంద్రబాబు లోక్ సభలో అవిశ్వాసం పెట్టగానే చర్చకు ఆమోదించరంట అని అన్నారు. అంతేకాదు బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదన్నారు.
