ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ కు తెలుగు సక్కగా రాదు..ఇంగ్లీష్ రాదు.
నాటు సారా అమ్ముకోని సామాన్యుల ప్రాణాలను తీస్తున్న వ్యక్తి సీఎం రమేష్ . అటువంటి వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత టీడీపీ పార్టీది.. గత నాలుగేళ్ళుగా విభజన చట్టంలో హమీల కోసం పోరాడకుండా.. ప్రత్యేక హోదా వద్దు ఫ్యాకేజీనే ముద్దు అని కాలం గడిపిన టీడీపీ నేతలు ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు అని ఆయన హెద్దేవా చేశారు ..