ఇటీవల కాలంలో మారుతున్న ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలా కోపంతో ఊగిపోవడం ఇదే మొదటిసారని టీడీపీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు. ఇంతకీ సీఎం చంద్రబాబు అంతలా కోపంతో ఊగిపోవడానికి కారణమేమిటి..? దానికి ఎవరు కారణం..? తెర వెనుక రాజకీయాలే ఇందుకు కారణమా..? చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన వారిలో మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
అయితే, పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఇటీవల టీడీపీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీలో ఎవరికి వారు అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని, ఇది పార్టీకి మంచిది కాదని నేతలకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పార్టీ పరువును బజారుకీడుస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారట. అంతేకాకుండా, ఏపీ ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టడంలో టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారని, అలా జరగకుండా ఎప్పటికప్పుడు ప్రతి విమర్శలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని సమాచారం.
ఇదే క్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా టిక్కెట్లను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. అసలు టిక్కెట్లు ఖరారు చేయడానికి మీరెవ్వరూ.. అంటూ యనమలతోపాటు నారా లోకేష్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.