టాలీవుడ్ మాస్‌మహారాజ్ రవితే, హాట్‌బ్యూటీ ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన ఖతర్నాక్ చిత్రం గుర్తుందా..? 2006 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే, ఆ చిత్రంలో విలన్ తన స్వప్రయోజనాల కోసం హీరో రవితేజను లేటు వయసులో చదివించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే, రవితేజకు విద్య నేర్పించే గురువుగా కమెడియన్ అలీని నియమిస్తాడు ఆ విలన్. ఇప్పుడు అదేసీన్ ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతోందట. ఈ విషయాన్నే ఓ సోషల్ మీడియా కథనం పూర్తి వివరాలతో సహా పేర్కొంది.
అయితే, నారా లోకేష్ పూర్తి రాజకీయ నేతగా ఎదిగేలా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నారా లోకేష్ మాత్రం తాను పాల్గొన్న ప్రతీ సభలోనూ..పార్టీ పరువు బజారుకీడ్చేలా మాట్లాడుతుండటం, అలాగే, ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో నారా లోకేష్ అభ్యర్థుల ప్రకటించాన్ని గమనించిన చంద్రబాబు సీరియస్ అయ్యాడట. వెంటనే యనమల రామకృష్ణుడును పిలిపించి నారా లోకేష్ వ్యవహార శైలిపై చర్చించారని ఆ సోషల్ మీడియా కథనం పేర్కొంది.
నేనేం చెప్పాను..? నీవేమి చేస్తున్నావు..? అంటూ మంత్రి యనమల రామకృష్ణుడుకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకాడట. లోకేష్‌కు రాజకీయంగా మాటలు, వ్యవహారశైలి నేర్పమంటే.. ఇలా మాట్లాడిస్తావా.. అంటూ మంత్రి యనమల రామకృష్ణుడుపై చంద్రబాబు సీరియస్ అయ్యారట. టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న తనను, అందులో ఒక మంత్రి పదవిలో ఉన్న తనను చంద్రబాబు అలా అనడంపై యనమల రామకృష్ణుడు కినుకు వహించారని సమాచారం.