ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీకే సవాలు విసిరారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అడిగిన ప్రధాని మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ఏపీ విషయంలో ప్రధాని మోదీకి సున్నా మార్కులు వేస్తాను.
గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకి వచ్చిన మోదీ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. విశాఖకి రైల్వే జోన్ ఇస్తామన్నారు. ఆర్థికంగా సాయం చేస్తా అన్నారు .
ఇలా పలు హామీలను కురిపించి అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళైన కానీ వాటి ఊసే లేదు. అందుకే ప్ర్దధాని మోదీకి సున్నా మార్కులు వేస్తున్నాను. దమ్ముంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు
ప్రకటించాలి. ప్రత్యేక హోదా ఇస్తానంటే ఎవరికైన మేము మద్ధతు ఇస్తాం అని తేల్చి చెప్పారు జగన్..