Home / POLITICS / జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, అమలు అవుతున్న కార్యక్రమాలు వారి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఉన్న శ్ర‌ద్ధ‌ను చాటిచెపుతున్నాయ‌ని మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు కోసం మీడియా అకాడెమీ చేస్తున్న పనులను వివరించడానికి జర్నలిస్టుల శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామ‌ని అయితే కొన్ని సంఘాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జర్నలిస్టుల జాతర లోనే సీఎం కేసీఆర్ మూడు  హామీలు ఇచ్చారు దాని ప్రకారమే ఇప్పుడు అమలు చేస్తున్నామ‌న్నారు.

“డెస్క్ జర్నలిస్ట్ లతో సహా అందరికి అక్రిడేషన్ లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 16 వేల పైచిలుకు అక్రిడేషన్ ఇచ్చాము. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న జర్నలిస్ట్ లకు కూడా అక్రిడేషన్ ఇచ్చాము. డెస్క్ అక్రిడేషన్ తెలంగాణ రాష్ట్రం లోనే మొదటిసారి ఇచ్చాము. అందులో మహిళ జర్నలిస్ట్ లకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాము. జర్నలిస్ట్ లకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు ఇచ్చారు. హెల్త్ కార్డుతో ఆపరిమితంగా వైద్య‌సేవ‌లు అందిస్తున్నాం“ అని తెలిపారు. “అక్రిడేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డు ఇవ్వబోతున్నాం. దానికి నేనే చైర్మన్. కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలలో చెల్లుబాటు అవుతుంది. జర్నలిస్ట్ లు అందరూ హెల్త్ కార్డు లు తీసుకోలేదు. అందరూ తీసుకోవాలి“ అని ఆయ‌న సూచించారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు హామీలు ఇచ్చారు అయ్యాక అమ‌లు చేశారని అల్లం నారాయ‌ణ తెలిపారు. `మూడో హామీ జర్నలిస్ట్ లకు ఇళ్ల‌ స్థలాలు. ఇందుకోసం 100 కోట్ల ఫండు ఇచ్చారు ముఖ్యమంత్రి ఇది ఏ రాష్ట్రంలో లేదు. మరణించిన కుటుంబ సభ్యులకు సహాయం చేస్తున్నాము. జర్నలిస్టుల కోసం జనహిత అమలు చేస్తున్నాం. జర్నలిస్ట్ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నాం. రాష్ట్రం ఏర్పడిన నుండి 150 చనిపోయారు వారి అందరికి ఆర్ధిక సహాయము చేశాం. 50 శాతం మందికి మాత్రమే సహాయం అందుతుంది అనడం శుద్ధ తప్పు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చెయ్యడం తప్పు“ అని ఆయ‌న తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat