వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లాంటి నాయకుడు ఏపీకి అవసరమని వైసీపీ నేత విజయ్‌చందర్ అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరిని వైఎస్ జగన్ చెరగని చిరునవ్వుతో ప్రతీ ఒక్కరిని పలుకరిస్తున్నారని, వైఎస్ జగన్ వెంట ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నట్టు విజయ్ చందర్ మీడియాతో చెప్పారు.
వృద్ధులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు సైతం జగన్ పాదయాత్రలో పాల్గొంటున్నారని, జగన్ తమ సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకాన్ని వారు తెలుపుతున్నారన్నారు. అంతేకాకుండా, టీడీపీ నేతలు, నాయకులు, శ్రేణులు ప్రతీ దానికి కూడా లక్షల.. లక్షల కమీషన్లు అడుగుతున్నారని, ఇప్పటికే నాలుగు లక్షల ఎకరాలను చిన్నా చితక రైతుల నుంచి చంద్రబాబు సర్కార్ లాక్కొందని, ఆఖరకు అసైన్డ్ భూములన్నిటినీ ప్రభుత్వం లాగేసుకుందని ఓ వృద్ధురాలు నాకు చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేసినట్టు వైసీపీ నేత విజయ్ చందర్ అన్నారు. చంద్రబాబుకు మరో సారి అధికారి ఇస్తే.. మొత్తం రాష్ట్రాన్నే దోచేసుకుంటాడయ్యా.. అందుకే చంద్రబాబుకు మేము ఓటేయము బాబూ అంటూ ఓ వృద్ధురాలు తనతో చెప్పిన మాటలను మీడియా ముందు వెల్లడించాడు.