ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మూడున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.
అయితే గత నాలుగేండ్లుగా చంద్రబాబు ప్రభుత్వం పలు అవినీతి అక్రమాలకు పాల్పడిందని గత ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారాన్ని దక్కించుకోని.నాలుగు ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఇటీవల బయటకు వచ్చిన బీజేపీ పార్టీ కూడా ఆరోపిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చంద్రబాబు నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు చేసిన పలు అవినీతి అక్రమాల చిట్టా తమ దగ్గర ఉందని ..త్వరలోనే వాళ్ళ పాపం పండి తీరుతుందని ..వాళ్ళ భాగోతాలు త్వరలోనే బయట పెడ్తామని హెచ్చారించారు..