ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అచ్యుతాపురం, రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్న వైఎస్ జగన్ కు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వేలాది మంది అయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. తమ కష్టలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
