తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్త దగ్గర నుండి ఎంపీలవరకు ,ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేస్తున్నా సంగతి విధితమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.
వీరి బాటలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నడుస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలోని మహబూబాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల మన్నలను పోందుతున్నారు..ఈ క్రమంలో ఉప్పరపల్లి గ్రామంలో తాటి చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాలతో మహబూబాబాద్ పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న కోయిగోరి యాకయ్యను మరియు ఇనుగుర్తి గ్రామనికి చెందిన గణేష్ లను మరియు పలువురుని పరామర్శించి అన్నిరకాలుగా అండగా ఉంటాను అని హమీచ్చారు.
సరైన వైద్యాన్ని అందించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు.ఇటీవల మహబూబాబాద్ పట్టణంలో మృతి చెందిన పత్తిపాక శంకరయ్య మరియు వల్లపునేని రామారావు ల కుటుంబాలను పరామర్శించి మానసిక దైర్యాన్ని ఇచ్చారు ఎమ్మెల్యే..ఇలా ఎవరు కష్టాల్లో ఉన్నా కానీ నేనున్నాను అంటు అక్కడ ప్రత్యేక్షమై వారి సమస్యలను తీరుస్తూ అన్ని రకాలుగ అండగా ఉంటున్నారు ఎమ్మెల్యే..