జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను దారుణంగా మోసం చేశాడు. నాకు విడాకులు ఇవ్వక ముందే మరో యువతితో సంబంధం పెట్టుకుని బిడ్డను కూడా కన్నాడు. ఈ విషయాలన్నీ జగమెరిగిన సత్యాలే. కానీ, అవన్నీ తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం నన్ను టార్గెట్ చేస్తూ.. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాపై అబద్ధాలు రాస్తూ సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, తాను కలిసి ఉన్న సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయితే, పవన్ మూడో భార్య అన్నా లెజీనోవా ఇటీవల బేబీ పొలాయనకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బేబీ పొలాయన పుట్టిన తేదీని.. అన్నా లెజీనోవా గర్భం దాల్చిన తేదీలను గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది రేణు దేశాయ్.
ఇక అసలు విషయానికొస్తే, బేబీ పొలాయన పుట్టింది 13 మార్చి 2012, అంటే అన్నా లెజీనోవా గర్భం దాల్చింది జులై 2011, పవన్ కళ్యాణ్‌కు, రేణుదేశాయ్‌కు విడాకులు ఖరారైంది అన్నాలెజీనోవా ప్రసవించిన తరువాతనే. అంటే తనతో సంసారం చేస్తూనే.. పవన్ కళ్యాణ్ అన్నా లెజీనోవాతో సంసారం చేశాడు అన్న విషయాన్ని రేణుదేశాయ్ గుర్తు చేసింది. దీన్ని బట్టే అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ నిజాయితీ ఏమిటో..! అంటూ కాస్త వ్యంగ్యాస్త్రాలను కూడా సంధించింది రేణు దేశాయ్. ఈ విషయాలన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి.. ఇకపై నా మీద అసత్యపు ప్రచారం చేయడం మానండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌నుద్దేశించి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.