2013 వరకు నేను ఇల్లు దాటి బయటకు రాలేదు. ఆ సమయంలో నాకు సోషల్ మీడియా అవసరం లేకుండా ఉండింది. నాకు పర్సనల్ ఫేస్‌బుక్ లేదు.. పర్సనల్ ట్విట్టర్ లేదు. కానీ, నేను ఏ రోజు డైరెక్టర్ కమ్ నిర్మాతను అయ్యానో.. ఆ సమయంలో ట్విట్టర్ వాడాల్సి వచ్చింది. ఎప్పుడైతే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశానో.. బూతల్.. బూతల్ ( బూతులు.. బూతులు) అంటూ ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రెండో భార్య రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇంటర్వ్యూలో భాగంగా రేణుదేశాయ్ మాట్లాడుతూ..ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులు తనపై బూతుల వర్షం కురిపించారని, పవన్‌ను నేను వదిలేసి వెళ్లానంట.. నేను డబ్బు పిచ్చి మనిషి.. నేను ఇదీ.. అదీ చాలా.. చాలా చెత్త బూతులు తిట్లు తిడుతూ కామెంట్లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్‌తో విడాకులను దృష్టిలో ఉంచుకుని.. అప్పుడే పవన్ కళ్యాణ్‌ను అడిగాను..ఒక్క కరెక్ట్ స్టేట్ మెంట్ మీ నుంచి వస్తే నా కష్టాలు తీరిపోతాయి అని అడిగా.. కానీ పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం నన్ను తీవ్రంగా బాధించింది అంటూ రేణు దేశాయ్ తన బాధను వెల్లబుచ్చింది.