ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి,బుట్టా రేణుక,కొత్తపల్లి గీత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాయిలాలకు ప్రలోభాలకు తలొగ్గి టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.
అయితే ఇటీవల వైసీపీకి చెందిన మిగిలిన ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి,వరప్రసాద్ లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో తమ ఎంపీపదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.దీంతో లోక్ సభ పక్ష నాయకుడిగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి తన ఎంపీ పదవీకిరాజీనామా చేయడంతో వైసీపీ తరపున లోక్ సభ వైసీపీ పక్ష నేతగా టీడీపీలో చేరిన కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ను కేంద్రం గుర్తించింది.
త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల నిమిత్తం దేశంలోని పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ పార్టీస్ ఎంపీలతో సమావేశానికి వైసీపీ పార్టీకి ఆహ్వనం పంపుతూ సమావేశాలకు వైసీపీ లోక్ సభ పక్ష నేతగా బుట్టా రేణుకను రావాల్సిందిగా అహ్వానం పంపింది.అంతేకాకుండా వైసీపీ నుండి ఫిరాయించిన మిగతా ఎంపీలను వైసీపీ ఎంపీలుగా గుర్తిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.. దీంతో పార్టీ ఫిరాయించిన ఎంపీలు తాము వైసీపీలో ఉన్నమా..టీడీపీలో ఉన్నమా అనే సందిగ్ధంలో పడేసింది కేంద్రం..