పూర్వ కాలంలో మన పూర్వీకులు, మన పెద్దలు సైతం మొలతాడు లేని వాడు.. మగాడు కాదు అంటుండటం మన వినే ఉంటాం. అంతెందుకు మన తెలుగు పాత సినిమాల్లోనూ ఈ డైలాగ్‌ను వినే ఉంటాం. అసలు మగాడికి, మొలతాడుకు ఉన్న సంబంధం ఏమిటి.? అది నిజమేనా..? అసలు మొలతాడు లేని వ్యక్తిని మగాడు కాదని ఎందుకు అంటారు..? మొలతాడును ఎందుకు కట్టుకుంటారు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
మన తెలుగు సాంప్రదాయం ప్రకారం గతంలో ప్రతీ పురుషుడు పంచె, లుంగీ లేదా ఏదైనా పని చేసే సమయంలో గోచి కట్టుకునేవారు. ప్రస్తుతం ఆ సాంప్రదాయం పల్లెల్లొ కొనసాగుతుండగా.. పట్టణాల్లో మాత్రం అక్కడక్కడ కొనసాగుతోంది. లుంగీలు, పంచెలు కట్టుకునే వారి సంఖ్య తగ్గుతూ.. సాంప్రదాయం కనుమరుగయ్యే పరిస్థితిలో ఉందనుకోండి..అది వేరే విషయం..!
అలా, పంచె, లుంగీ, గోకి కట్టుకున్న సమయంలో జారి పోకుండా మొలతాడును కట్టుకునే వారు. ఇప్పుడు అందరూ ప్యాంట్లకు అలవాటు పడ్డారు. ప్యాంటుకు అనుగుణంగా బెల్టులను వాడుతున్న విషయం తెలిసిందే. బెల్టు వచ్చింది కదా.. ఇంకా మొలతాడు ఎందుకు..? అన్నది నేటి సమాజం ప్రశ్న. మొలతాడు కట్టకపోతే బీర్జాలు జారిపోతాయ్.. ఇంకేదో అయిపోతుంది..అనుకుంటే పొరపాటేనని, మొలతాడుకు మన శరీరానికి ఎటువంటి సంబంధం లేదని సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం పేర్కొంటున్నారు.