గర్భిణీగా ఉన్న సమయంలో.. ఆ మహిళతో శృంగారం చేయొచ్చా..? చేస్తే ఎటువంటి భంగిమల్లో చేయాలి..? మహిళ గర్భం దాల్చిన తరువాత ఎన్నో నెల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు..? గర్భం దాల్చిన మహిళతో శృంగారం ఎలా చేయాలి..? అన్నప్రశ్నలకు సెక్సాలజిస్ట్లు ఏం చెబుతున్నారో తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..!
అయితే, నిపుణులు చెప్పిన సమాధానం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గర్బిణీకి ఏడో నెల నిండే వరకు అన్ని రకాల రతి భంగిమల్లో.. ఆ మహిళతో శృంగారం చేయొచ్చు. అయితే, అంతకు ముందు వైద్యులు ఏమైనా సూచనలు చేస్తే వాటిని తప్పకుండా పాటించాలని, అలాగే, ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే తప్ప.. ఇక మామూలు రోజుల్లో గర్భిణీతో శృంగారం చేయొచ్చని సెక్సాలజిస్ట్లు చెబుతున్నారు.
అయితే, గర్భిణీతో శృంగారం చేసే సమయంలో మగవారు కిందకు ఉండి.. ఆడ వారు పైకి ఉంటే మంచిదని సెక్సాలజిస్ట్లు చెబుతున్నారు. అలా ఆడవారు పైకి ఉండలేని సమయంలో కనీసం ఎడమవైపుకు తిరిగి శృంగారం చేయొచ్చని చెబుతున్నారు. ఒక వేళ మగవారు పైకి ఉండి.. ఆడవారు కిందకి ఉంటే ఆ సమయంలో ఆడవారి శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందని సెక్సాలజిస్ట్ల మాట.