మందుబాబులకు గోవా సర్కార్ దిమ్మతిరిగేల కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే జరిమానాలు విధిస్తామని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు . దీనికి సంబంధించి త్వరలోనే ఓ నోటిఫికేషన్ జారీ చేస్తామని అయన తెలిపారు.ఆగస్టు నుంచి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే రూ.2,500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు . ఈ విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని అయన అన్నారు.గోవా రోడ్లపై ఖాళీ బీరు సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటున్నాయని అన్నారు. ఇటీవల అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ ప్రాంతంలో కాలేజీ విద్యార్థులు బీర్లు తాగుతూ కనిపించారని తెలిపారు. ఖాళీ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో మిగతా ప్రజలకు ప్రమాదమని అయన అన్నారు.
